విశాఖపట్నంలో తాజ్ గ్రూప్ హోటల్!
- అనువైన స్థలం కోసం పరిశీలించిన సంస్థ ప్రతినిధుల బృందం
- విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో స్థల పరిశీలన
- తాజ్ ప్రతినిధులకు భూములను చూపించిన రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులు
ఇందులో భాగంగా బుధవారం విశాఖలో కొన్ని స్థలాలను పరిశీలించగా, గురువారం అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. అలాగే విజయనగరం జిల్లా భోగాపురం సమీప ప్రాంతాలను కూడా వారు పరిశీలించారు. దీంతో రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులు తాజ్ ప్రతినిధులకు ఆయా భూములను చూపించడం జరిగింది.