పవన్ బయటపడ్డారు.. మేం పడలేదు అంతే..!: ఏపీ హోంమంత్రి అనిత
- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి
- డిప్యూటీ సీఎంతో క్లారిటీగా మాట్లాడినట్లు వెల్లడి
- గతంలో రాజకీయంగా నేరాలను ప్రోత్సహించడం వల్లే ఇప్పుడీ పరిస్థితి అంటూ ఆవేదన
శ్రీ సత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ జరగడం బాధాకరమని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. గతంలో రాజకీయంగా నేరాలు ప్రోత్సహించడమే ఇప్పుడీ పరిస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్థులకు వెంటనే శిక్షలు విధించి, అమలు చేయడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని అనిత చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జగన్ కు భావప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు గుర్తుకు వచ్చినట్లుంది.. గత ప్రభుత్వ హయాంలోనూ పోలీసులు ఇబ్బంది పడ్డ విషయం మాత్రం గుర్తులేదని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు.