యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ.. నటుడు విజయ్ దేవరకొండకు స్వల్ప గాయం
- గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కాంబోలో 'వీడీ12' మూవీ
- ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా షూటింగ్
- ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తుండగా విజయ్‌కు స్పల్ప గాయం
- ఆసుపత్రిలో ఫిజియోథెరపీ అనంతరం మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్న యువ నటుడు
దాంతో చిత్రం యూనిట్ వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అక్కడ ఫిజియోథెరపీ చేసిన అనంతరం మళ్లీ విజయ్ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నట్టు సమాచారం. ఇక ఈ మూవీలో విజయ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 2025 మార్చి 28న సినిమా విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత రాహుల్ సాంకృత్యాయన్, రవికిరణ్ కోలా డైరెక్షన్‌లలో వరుసగా రెండు సినిమాల్లో విజయ్ నటించనున్నాడు.