హైదరాబాద్ లో కోటి దీపోత్సవం.. ఎప్పటి నుంచంటే!
- ఈ నెల 9 నుంచి 25 వరకు ఎన్టీవీ- భక్తి టీవీల ఆధ్వర్యంలో నిర్వహణ
- ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో రోజూ సాయంత్రం దీపోత్సవం
- చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు
దీపపు కాంతులు, వేద పండితులు, స్వామీజీల ప్రవచనామృతాలు, ప్రత్యేక అర్చనలు, దేవదేవుల కల్యాణాలు, లింగోద్భవం, కల్యాణ కమనీయాలతో రోజుకో ప్రత్యేక కార్యక్రమంతో వీక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తనుంది. ఏటా వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
శివకేశవులని ఒకే వేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే కోటి దీపోత్సవం అని చెప్పారు. ఈ దీపయజ్ఞంలో వివిధ పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనాలు చెబుతారని తెలిపారు.