జానీ మాస్టర్ అంశంలో క్లారిటీ ఇచ్చిన పుష్ప-2 నిర్మాతలు
- పుష్ప-2లో ప్రత్యేకగీతంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
- జానీ మాస్టర్ స్థానంలో మరో కొరియోగ్రాఫర్‌ను ఎంపిక చేశామని వివరణ
- త్వరలోనే ఆ పాటను చిత్రీకరిస్తామని తెలిపిన నిర్మాతలు
దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన రెండు పాటలు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేశారు. అవి ఎంత పాపులారిటీని పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గతంలో 'పుష్ప: ది రైజ్'లో ఊ అంటావా... మామ... ఊ ఊ అంటావా మామ... అనే ప్రత్యేక గీతం ఎంత పాపులర్ అయ్యిందో అందిరికి తెలిసిందే. ఈ పాటలో సమంత డ్యాన్స్ మూమెంట్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. కాగా పుష్ప-2: ది రూల్‌లో కూడా ఓ ప్రత్యేకగీతం తెరకెక్కించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ ఐటెమ్‌సాంగ్‌లో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ చేస్తున్నట్లుగా సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతంలో ఈ ప్రత్యేక గీతానికి జానీమాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారని పుష్ప-2 నిర్మాతలు ప్రకటించారు. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల వివాదం నడుస్తున్న నేపథ్యంలో, ఆయన ఈ పాటకు కొరియోగ్రఫీ చేయడం లేదని, ఆయన స్థానంలో ఇంకో డ్యాన్స్‌మాస్టర్‌ను ఎంపిక చేసుకున్నామని నిర్మాతలు తెలియజేశారు. త్వరలోనే ఈ పాటను కూడా చిత్రీకరిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.