Rahul Sipligunj: నేను చేసిన ఆ తప్పుకి ఇప్పటికీ బాధపడుతుంటా: రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj about sharing of Rajinikanth pic

  • తాను రజనీకాంత్ కు వీరాభిమానినన్న రాహుల్
  • మూవీ లుక్ లోనే రజనీ తనతో ఫొటో దిగారని వెల్లడి
  • ఆ ఫొటోను షేర్ చేసి తప్పు చేశానని ఆవేదన

'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటతో ఎంతో మంది అభిమానులను రాహుల్ సిప్లిగంజ్ సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ ఫేమ్ గా కూడా ఆయనకు చాలా క్రేజ్ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ... తాను చేసిన ఒక తప్పును బయటపెట్టారు. 

తాను రజనీకాంత్ కు వీరాభిమానినని రాహుల్ తెలిపారు. 'అన్నాత్తే' సినిమా షూటింగ్ సమయంలో ఆయనను కలిసే అవకాశం తనకు దక్కిందని... తన ఇష్టాన్ని గుర్తించి, ఆ మూవీ లుక్ లోనే ఆయన తనతో ఫొటో దిగారని చెప్పారు. ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ ను ఇంకా రిలీజ్ చేయలేదని, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఫొటోను షేర్ చేయవద్దని రజనీకాంత్ తనకు చెప్పారని తెలిపారు. అయితే, కొన్ని రోజుల తర్వాత తాను ఆ ఫొటోను షేర్ చేశానని... ఆ పిక్ వైరల్ అయిందని చెప్పారు. తన జీవితంలో తాను చేసిన తప్పు అదేనని... అలా చేసినందుకు తాను ఇప్పటికీ బాధ పడుతుంటానని తెలిపారు.

  • Loading...

More Telugu News