Animal Viral Video: చుట్టుముట్టిన సింహాల గుంపు.. దూడను రక్షించుకునేందుకు గేదె ఉగ్రరూపం.. వీడియో ఇదిగో!

Buffalo Turns Yamraj to Save Calf From Lion

  • అడవిలో తల్లితో కలిసి వెళుతున్న దూడపై సింహాల గుంపు ఎటాక్
  • దూడను నోట కరుచుకుని ఎత్తుకెళ్లిన సింహం
  • ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిన గేదె
  • మృగరాజుల నుంచి దూడను రక్షించి తీసుకెళ్లిన వైనం

పిల్లల జోలికి వస్తే అటుపక్క ఉన్నది ఎవరైనా సరే తల్లి తాట తీస్తుందని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. చుట్టుముట్టిన సింహాల గుంపుతో వీరోచితంగా పోరాడిన ఓ గేదె తన దూడను రక్షించుకుంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కామెంట్లతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. 

సాధారణంగా అడవిలో సింహాలను చూసిన ఏ జంతువైనా బిక్కచచ్చిపోతుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతుంది. అయితే, ‘నేచర్ ఈజ్ బ్రూతల్’ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ఈ అరుదైన వీడియోలో మాత్రం సింహాలపాలిట గేదె యమరాజులా మారిపోయింది. తన దూడతో కలిసి వెళుతున్న గేదెను సింహాల గుంపు వెంబడించింది. 

చివరికి ఓ సింహం ఆ దూడను నోట కరుచుకుని ఎత్తుకెళ్లింది. ఆ వెంటనే గేదె ఉగ్రరూపం దాల్చింది. సింహాలను వెంటబెట్టింది. తన దూడను ఎత్తుకెళ్లిన సింహంపైకి లంఘించింది. చివరికి దూడను రక్షించి వెంట తీసుకొచ్చింది. గేదె ఎదురు తిరగడంతో సింహాల గుంపు తోక ముడవక తప్పలేదు. 

ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎదురు తిరగనంత వరకే ఎవరి ఆటలైనా సాగుతాయని, ఒకసారి ఎదురు తిరిగితే సింహాల్లానే తోకముడవక తప్పదని కామెంట్ చేస్తున్నారు. తన సంతానాన్ని రక్షించుకునేందుకు ఏ తల్లి అయినా ఎంతకైనా తెగిస్తుందని మరొకరు రాసుకొచ్చారు. 

  • Loading...

More Telugu News