పవన్ కల్యాణ్ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టారు!
- హరి హర వీర మల్లు లిరికల్ వీడియో అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
- పాటను స్వయంగా ఆలపించిన పవన్ కల్యాణ్
- అక్టోబరు 14 నుంచి నవంబరు 10 వరకు చిత్రీకరణ పూర్తి
కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ నెల 14న తిరిగి ప్రారంభం కానుందని, నవంబరు 10 వరకు జరిగే షూటింగ్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని ఇక ఈ చిత్రం నుంచి తొలి లిరికల్‌ను త్వరలోనే విడుదల చేస్తున్నామని, ఈ గీతాన్ని పవన్‌కల్యాణ్ స్వయంగా ఆలపించడం విశేషమని మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను దసరా సందర్భంగా విడుదల చేసి లిరికల్ పాట విడుదల అప్‌డేట్‌ను ఇచ్చారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ''సామ్రాజ్యవాదులు, అణచివేతదారులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం ఒక యోధుని అలుపెరగని పోరాటమే ఈ సినిమా. పవన్ కల్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' చిత్రం 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది" అని తెలిపారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, సచిన్ ఖేడ్ ఖర్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, మురళీశర్మ, అయ్యప్ప శర్మ, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం.ఎ.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.