మహేష్‌బాబు.పి దర్శకత్వంలో రామ్ పోతినేని
- డబుల్ ఇస్మార్ట్ తరువాత రామ్ నూతన చిత్రం
- విజయ దశమి సందర్భంగా ప్రకటించిన మేకర్స్
- యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ర్యాపో 22
మేకర్స్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విజయ దశమి పర్వదినాన విడుదల చేశారు. హీరోగా రామ్ పోతినేనికి కెరీర్‌లో ఇది 22వ చిత్రం అవుతుంది. ఈచిత్రంలో రామ్ సరికొత్త అవతార్‌తో కనిపించనున్నాడని తెలిసింది. యాక్షన్‌తో పాటు వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ర్యాపో 22 అనేది ఈ సినిమా వర్కింగ్ టైటిల్.
నవంబర్ నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని, రామ్ పోతినేనితో సినిమా చేయడం చాలా ఆనందంగా వుందని, హై ఎనర్జీతో న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్‌తో ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ తెలిపారు. కథానాయిక, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు