చిరంజీవి సినిమా సెట్స్ పై ఇద్దరు భామలతో వెంకీ మామ సందడి
- చిరంజీవి హీరోగా విశ్వంభర
- వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో ఎస్వీసీ58
- మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ లతో కలిసి విశ్వంభర సెట్స్ పైకి వెంకటేశ్
ఇవాళ వెంకటేశ్, అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్... విశ్వంభర సెట్స్ పై చిరంజీవిని కలిశారు. రెండు చిత్రాల షూటింగ్ లు పక్కపక్కనే జరుగుతుండడంతో కోలాహలం నెలకొంది.
వెంకీ మామ, అనిల్ రావిపూడి, ఐశ్వర్య, మీనాక్షిలను చిరంజీవి విశ్వంభర సెట్స్ పైకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి మధ్య సరదా క్షణాలు చోటుచేసుకున్నాయి.


