Diesel: హైదరాబాద్-విజయవాడ హైవేపై పేలిన డీజిల్ ట్యాంకర్

Diesel tanker burnts in Hyderabad Vijayawada Highway

  • నల్గొండ జిల్లా చిట్యాలలో ప్రమాదం
  • డివైడర్‌ను ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్
  • కిందకు దూకడంతో ప్రమాదం నుంచి బయటపడిన డ్రైవర్

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఓ డీజిల్ ట్యాంకర్ పేలింది. నల్గొండ జిల్లాలోని చిట్యాలలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీజిల్ ట్యాంకర్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీపై ఉన్న డీజిల్ ట్యాంకర్ పేలిపోయింది. డ్రైవర్ లారీ నుంచి కిందకు దూకడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News