మల్లన్న క్షేత్రంలో నాగసాధుగా తమన్నా లుక్ చూశారా?
- ఓదెల 2లో నాగసాధుగా కనిపించనున్న తమన్నా
- కెరీర్‌లో తొలిసారిగా ఈ పాత్రలో కనిపించనున్న తమన్నా
- ఓదెల మల్లన్న ఆలయంలో చిత్రీకరణ చేస్తున్న చిత్రయూనిట్
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన తమన్నా ఫస్టలుక్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణలో భాగంగా చివరి షెడ్యూల్ ఓదెల విలేజ్ లో జరుగుతోంది. మహాదేవుని ఆశీస్సులతో కాశీలో ప్రారంభమైన ఈ థ్రిల్లింగ్ సీక్వెల్ ఇప్పుడు ఓదెల మల్లన్న క్షేత్రంలో చిత్రీకరణ జరుగుతోందని, టీం ఐకానిక్ ఓదెల మల్లన్న ఆలయం, గ్రామంలోని అందమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను షూటింగ్ చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్నా, మురళీ శర్మ, హెబ్బా పటేల్, యువ, ఇతర నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు.