అభిప్రాయాలు మారుతూ ఉంటాయి: దిల్ రాజు
- 'జనక అయితే గనక' సినిమాపై నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
- సుహాస్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల
- నచ్చితే 'బలగం' సినిమాలా ప్రోత్సహించాలని కోరిన దిల్ రాజు
నచ్చితే బలగం సినిమాలా దీనిని ప్రోత్సహించాలని, నచ్చకపోతే విడుదల వరకూ సైలెంట్ గా ఉండాలని సరదాగా పేర్కొన్నారు. తమ సినిమా 70 శాతం మందికి నచ్చుతుందని దిల్ రాజు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలు విడుదలైన తొలి రోజు చాలా మంది హంగామా చేస్తారన్నారు. రెండో రోజు వసూళ్లు చూసి తమకు నచ్చకపోయినా సినిమా హిట్ అయింది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారన్నారు. అభిప్రాయాలు మారుతూ ఉంటాయని దిల్ రాజు పేర్కొన్నారు.