అందుకే లులూకు ప్రత్యామ్నాయంగా ఇనార్బిట్ మాల్ తీసుకువచ్చాం: బొత్స
- 1200 కోట్ల విలువైన స్థలంలో 600 కోట్ల పెట్టుబడి పెడతామన్నారన్న మాజీ మంత్రి బొత్స
- లులూకు ప్రత్యామ్నాయంగా ఇనార్బిట్ మాల్ తీసుకువచ్చామని వెల్లడి
- ఎన్నో హామీలు ఇచ్చారని, అవి నెరవేర్చండని సూచించిన బొత్స
తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. లులూ కంపెనీలు మళ్లీ విశాఖ వస్తున్నాయని హడావుడి చేస్తున్నారన్నారు. లులూ మొదట ఆర్కే బీచ్ రోడ్డులో 1200 కోట్ల విలువ చేసే భూముల్లో 600 కోట్ల పెట్టుబడి పెడతామన్నారని, అందుకే ఆలోచించాల్సి వచ్చి వద్దన్నామని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చామని బొత్స తెలిపారు. వైసీపీ హయాంలో ఎన్నో మంచి పనులు చేశామని అన్నారు. ఎక్కడో చిన్న చిన్న తప్పులకు ప్రజలు వారికి ప్రభుత్వాన్ని అప్పగించారని వ్యాఖ్యానించారు. ఎన్నో హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చండని కూటమి ప్రభుత్వానికి బొత్స సూచించారు.