లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు... చంద్రబాబు, పవన్ లను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ట్వీట్!
- శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దన్న కోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించిన ప్రకాశ్ రాజ్
- చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలతో ట్వీట్
ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేసిన క్లిప్పింగ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు ఉన్నాయి. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించిందని అందులో పేర్కొన్నారు.
ల్యాబ్ రిపోర్ట్ సవివరంగా లేదని, అలాంటప్పుడు మీరు నేరుగా మీడియా ముందుకు ఎందుకు వెళ్లారని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయాన్ని పేర్కొన్నారు.