హీరో నానికి 'యెల్లమ్మ' కథ ఎందుకు నచ్చలేదో తెలుసా?
- నానికి కథ చెప్పిన వేణు
- మాస్ బాటలో నాని
- శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని సినిమా
ఇది తెలుసుకున్న నిర్మాత దిల్‌రాజు నానికి వేణుతో కథ కూడా చెప్పించాడు. నానికి కథ కూడా నచ్చింది. ఇక నాని హీరోగా, దిల్‌రాజు నిర్మాతగా ఈ సినిమా త్వరలోనే సెట్స్‌మీదకు వెళుతుందని అనుకున్నారు. అంతేకాదు, వేణు ఈ చిత్రానికి 'యెల్లమ్మ' అనే టైటిల్‌ను కూడా నిర్ణయించాడు. అయితే ఇంతలోనే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా నానికి ఓ కథ వినిపించాడు. అయితే మాస్ హీరోగా తన ఇమేజ్‌ను పెంచుకునే ప్రయత్నంలో వున్న నానికి, వేణు కథ కంటే శ్రీకాంత్ కథలో మాస్ ఎలిమెంట్స్‌కు స్కోప్ ఎక్కువ వుండటంతో వేణు కథను పక్కన పెట్టాడని సమాచారం.
ముందుగా శ్రీకాంత్ ఓదెల కథ చేసిన తరువాతనే ఏ కథ గురించైనా ఆలోచిస్తానని చెప్పాడట. అయితే దసరా దర్శకుడు చెప్పిన కథలో వున్న కమర్షియల్ అంశాలు నానికి మాస్‌లో మంచి ఇమేజ్‌ను తెచ్చిపెట్టే విధంగా వున్నాయని తెలిసింది. అయితే బలగం వేణు చెప్పిన కథలో కూడా మంచి ఎమోషన్‌తో పాటు ఓ నావెల్టీ పాయింట్ వుందని అతని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇటీవల 'సరిపోదా శనివారం' ప్రెస్‌మీట్‌లో బలగం వేణుతో సినిమా వుందా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తప్పకుండా 'మా కలయికలో సినిమా వుంటుంది. అందుకు కథ కోసం వెయిటింగ్' అంటూ సమాధానమిచ్చారు.