సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందించిన మోహన్ బాబు
- ఏపీలో ఇటీవల వరద బీభత్సం
- సీఎం రిలీఫ్ ఫండ్ కు మోహన్ బాబు విరాళం
- రూ.25 లక్షల చెక్ ను చంద్రబాబుకు అందించిన మోహన్ బాబు, విష్ణు
ఇవాళ మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వరద బాధితుల కోసం రూ.25 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మోహన్ బాబును సీఎం చంద్రబాబు అభినందించారు. ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు.