ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిప్పు అంటుకొని 'దేవర' కటౌట్ దగ్ధం
- దేవర సినిమా విడుదల కావడంతో అభిమానుల సందడి
- సుదర్శన్ 35 ఎంఎం వద్ద టపాసులు పేల్చిన అభిమానులు
- కటౌట్‌కు నిప్పు అంటుకొని దగ్ధం
- రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
ఈ సినిమా ప్రీమియర్ షో గురువారం ఆర్ధరాత్రి ఒంటిగంటకు వివిధ థియేటర్లలో ప్రారంభమైంది. స్టార్ హీరోల సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తుంటారు. సుదర్శన్ 35 ఎంఎం వద్ద కూడా అభిమానులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ కటౌట్‌కు మంటలు అంటుకొని, దగ్ధమైంది.
సమాచారం తెలియగానే అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కటౌట్‌పై ఉన్న పూలదండల మధ్య టపాసులు కాల్చడంతో మంటలు చెలరేగినట్లుగా చెబుతున్నారు.