మహేశ్ బాబు సరసన విదేశీ కథానాయిక
- మహేశ్ కు జోడీగా ఇండోనేషియా తార చెల్సియా ఎలిజబెత్
- పరిశీలనలో మరో ఇద్దరు విదేశీ హీరోయిన్ల పేర్లు
ఇప్పుడు ఈ కోవలోనే మహేశ్ బాబు- రాజమౌళి కలయికలో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్ కోసం దర్శకుడు రాజమౌళి పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ సినిమాకు అంతర్జాతీయంగా వున్న మార్కెట్ ను దృష్టిలో వుంచుకుని మహేశ్ కు జోడీగా ఓ విదేశీ భామను ఎంపిక చేస్తున్నారని తెలిసింది. ఇండోనేషియా హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్‌తో పాటు మరో ఇద్దరు ఫారిన్ భామల పేర్లు లిస్ట్‌లోకి వచ్చాయి. అయితే ఇంకా ఈ విషయంపై క్లారిటీ రాలేదు. వచ్చే నెలలో ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.