'దేవర' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దుతో విధ్వంసం.. నిర్మాతలకు సరికొత్త తలనొప్పులు
- గత ఆదివారం జరగాల్సిన 'దేవర' ప్రీరిలీజ్ ఈవెంట్
- కెపాసిటీకి మించి పోటెత్తిన అభిమానులు
- హోటల్ లోని ఫర్నిచర్ ను, సామగ్రిని ధ్వంసం చేసిన ఫ్యాన్స్
అభిమానుల ఆగ్రహజ్వాలలతో హోటల్ కు భారీ నష్టం వాటిల్లింది. తమకు వాటిల్లిన నష్టాన్ని చెల్లించాలని 'దేవర' నిర్మాతలను హోటల్ యాజమాన్యం కోరింది. తమకు రూ. 33 లక్షల నష్టం వాటిల్లినట్టు హోటల్ యాజమాన్యం లెక్కకట్టింది. కుర్చీలకే రూ. 7 లక్షల వరకు అయినట్టు సమాచారం. దీంతో పాటు మెయిన్ గ్లాస్, ఎలివేటర్ గ్లాస్, కొన్ని డోర్లు కూడా ధ్వంసమయ్యాయని హోటల్ యాజమాన్యం తెలిపింది. మరోవైపు బిల్లును కాస్త తగ్గించాలని హోటల్ యాజమాన్యాన్ని నిర్మాతలు కోరినట్టు సమాచారం.