'హరిహర వీరమల్లు' సెట్స్ పైకి పవన్ .. రిలీజ్ డేట్ ఇదే!
- చాలాకాలం క్రితమే మొదలైన 'హరి హర వీరమల్లు'
- కొన్ని కారణాల వలన వాయిదాలు పడుతూ వచ్చిన ప్రాజెక్టు
- క్రిష్ దర్శకత్వంలో చాలా వరకూ పూర్తి
- ఇప్పుడు దర్శకత్వం వహిస్తున్న జ్యోతికృష్ణ
- వచ్చే మార్చి 28వ తేదీన సినిమా విడుదల
ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి, మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ రోజు నుంచి మొదలవుతున్న షెడ్యూల్ నుంచి ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
చారిత్రక నేపథ్యంలో నడిచే కథ ఇది. బందిపోటు పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ అలరించనుంది. అర్జున్ రామ్ పాల్ .. జాక్విలిన్ ఫెర్నాండెజ్ .. ఆదిత్య మీనన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. చూడాలి మరి ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో.