Nagababu: చాలా గర్వంగా ఉంది.. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న‌య్య‌: నాగబాబు

Nagababu Tweet on Megastar Chiranjeevi

  • గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్సులో చోటు ద‌క్కించుకున్న చిరంజీవి 
  • ఈ నేప‌థ్యంలో చిరుకు సినీ, వివిధ‌ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల విషెస్
  • 'ఎక్స్' వేదిక‌గా త‌న అన్న‌య్య‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు

150కి పైగా సినిమాల్లో అత్య‌ధిక డ్యాన్స్ స్టెప్పులతో అల‌రించినందుకు గాను మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్సులో చోటు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. చిరుకు ఈ అరుదైన గౌర‌వం ద‌క్క‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే మెగాస్టార్‌కు సినీ, వివిధ‌ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు విషెస్ తెలియ‌జేస్తున్నారు. 

ఈ క్ర‌మంలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా త‌న అన్న‌య్య‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. చిరంజీవికి ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం ప‌ట్ల ఆయ‌న ఆనందం వ్య‌క్తం చేశారు.

"నేను డిగ్రీ చదివేటప్పుడు నా దగ్గర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకం ఉండేది. అందులో సినిమా సంబంధిత రికార్డ్స్ నేను అంత‌గా చూడలేదు. ఏవైనా అద్భుతమైన సెట్స్ వేసినప్పుడో, బాండ్ చిత్రాల వంటి వాటిల్లో బోట్ తో లాంగ్ జంప్స్ చేసినప్పుడో ఇలా కొన్ని రికార్డ్స్ గురించి మాత్ర‌మే చదివాను. అవి కూడా చాలా తక్కువలో తక్కువ. నాకు తెలిసి ఒక 5 శాతం మాత్రమే సినీ సంబంధిత రికార్డ్స్ ఉండివుండొచ్చు.

కానీ, అన్నయ్యకి 156 చిత్రాలలో 537 పాటల్లో 24 వేల డాన్స్ మూమెంట్స్ చేసినందుకు గాను ఇలాంటి అరుదైన రికార్డ్ గిన్నిస్ బుక్‌లో నమోదు చేస్తూ పురస్కరించినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న‌య్య" అని మెగా బ్ర‌ద‌ర్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News