Devara: అమెరికాలో దుమ్మురేపుతున్న 'దేవర'

Junior NTR Devara shaking box office in USA

  • ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'దేవర'
  • విడుదలకు ముందే బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న తారక్ మూవీ
  • హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ప్రీమియర్ షో టికెట్లు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రంపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా... కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్... ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. 'దేవర 1' ఈ నెల 27న విడుదల అవుతోంది. మరోవైపు ఈ సినిమా విడుదల కాకముందే బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. అమెరికాలో 'దేవర' దుమ్మురేపుతోంది. ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటికే 25 వేల టికెట్లు అమ్ముడుపోయి... 8 లక్షల డాలర్లను వసూలు చేశాయి.

  • Loading...

More Telugu News