చేసిన పొరపాటుకు 2 నెలలు ఏడుస్తూనే ఉన్నా: విక్రమ్
- మణిరత్నం 'బొంబాయి' సినిమా ఛాన్స్ తొలుత తనకే వచ్చిందన్న విక్రమ్
- ఫైనల్ ఆడిషన్ లో పొరపాటు చేశానని వెల్లడి
- మణిరత్నం ఫిల్మ్ మేకింగ్ ను తాను ఎంతో ఇష్టపడతానన్న విక్రమ్
అప్పట్లో తనకు 'బొంబాయి' సినిమా ఆఫర్ వచ్చిందని, తనను హీరోగా ఎంచుకున్నారని విక్రమ్ చెప్పారు. అయితే ఫైనల్ ఆడిషన్ లో తాను చేసిన చిన్న పొరపాటు వల్ల ఆ సినిమాలో నటించే అవకాశం చేజారిందని తెలిపారు. తనను సడన్ గా ఆడిషన్ కు పిలిచారని... వీడియో కెమెరా కాకుండా స్టిల్ కమెరా తీసుకొచ్చి... సీన్ వివరించి యాక్ట్ చేయమన్నారని చెప్పారు. అయితే మూమూలు కెమెరా తీసుకొచ్చి యాక్ట్ చేయమంటారేమిటి? ఎందుకు యాక్ట్ చేయాలి? అనిపించిందని... స్టిల్ కెమెరా కావడంతో తాను కదిలితే పిక్చర్ బ్లర్ గా వస్తుందని తాను భావించి అలాగే ఉండిపోయానని తెలిపారు. ఆ విధంగా ఆ సినిమా తన చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పొరపాటుకు తాను 2 నెలల పాటు ఏడుస్తూనే ఉన్నానని చెప్పారు. ఆ తర్వాత 'బొంబాయి' సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిందని అన్నారు.