గంటకు 234 కి.మీ.వేగంతో దూసుకెళ్లిన హీరో అజిత్.. వీడియో ఇదిగో!
- ‘ఎన్నా స్పీడ్ తలా..’ అంటూ అభిమానుల కామెంట్లు
- ఆడి కారులో కళ్లు చెదిరే వేగంతో అజిత్ డ్రైవింగ్
- అభిమానులు అనుకరించే ప్రమాదం ఉందంటూ నెటిజన్ల విమర్శలు
విదేశీ రోడ్లపై వాహనాలు గంటకు 150, 200 కి.మీ. వేగంతో దూసుకెళ్లడం సాధారణమే. అక్కడి రోడ్ల నిర్మాణంలో ప్రత్యేకతల వల్ల ఆ వేగంతో వెళ్లడానికి వీలవుతుంది. కాగా, ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. బైక్, కార్ రేసింగ్ పై ఇష్టంతో అజిత్ ఇంటర్నేషనల్ ఎఫ్ఐఏ రేసింగ్ ఛాంపియన్ షిప్ లలో పాల్గొన్న విషయం గుర్తుచేశారు. ఆయన శిక్షణ పొందిన రేసర్ అనే విషయం తెలియని అభిమానులు ఆయనను అనుకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియోను చూసి ఆయన అభిమానులు ఇండియన్ రోడ్లపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కార్ల రేస్ కు ప్రయత్నించే అవకాశం ఉందని విమర్శిస్తున్నారు.