సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ
- 1,130 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
- ఈ నెల 31 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక
ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్న దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 30 తో ముగియనుంది. ఇంటర్ పూర్తిచేసి 01.10.2001 నుంచి 30.09.2006 మధ్య కాలంలో పుట్టిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి. పీఈటీ, పీఎస్‌టీ, సర్టిఫికెట్ పరిశీలన, రాత పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేలు రూ.21,700 నుంచి 69,100 వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది.