సినిమా షూటింగ్‌లో గాయపడిన రవితేజకు ఆపరేషన్... ఆరు వారాల విశ్రాంతి
- కొత్త డైరెక్టర్ భాను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్టీ 75
- హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ
- షూటింగ్ సందర్భంగా గాయపడిన రవితేజ
షూటింగ్ సందర్భంగా గురువారం ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఆయన కుడిచేతికి గాయమైంది. ఈ గాయాన్ని లెక్కచేయకుండా ఆయన షూటింగ్‌లో పాల్గొనడంతో అది పెద్దగా అయింది. దీంతో ఆపరేషన్ చేయవలసి వచ్చింది. రవితేజ గాయపడిన విషయం తెలిసిన అభిమానులు... త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. రవితేజకు ఆపరేషన్ విజయవంతమైందని యశోద ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. రవితేజకు ఆరువారాల విశ్రాంతి అవసరమన్నారు.