మరోసారి జంటగా శివాజీ-లయ... క్లాప్ కొట్టిన దిల్ రాజు
- గతంలో పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించిన శివాజీ, లయ
- తాజాగా కొత్త దర్శకుడు సుధీర్ శ్రీరామ్ డైరెక్షన్ లో చిత్రం
- 14 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న శివాజీ, లయ
ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాదులో జరిగింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టారు. శివాజీ తనయుడు రిక్కీ కెమెరా స్విచాన్ చేశాడు. ఈ ఓపెనింగ్ సెర్మనీకి హాజరైన స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముహూర్తం షాట్ కు దర్శకత్వం వహించారు.
కాగా, ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఆగస్టు 20 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఇతర తారాగణం వివరాలు ప్రకటించనున్నారు.


