బీఆర్ఎస్ రుణమాఫీ చేస్తే రైతులకు వడ్డీకి కూడా సరిపోలేదు: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
- కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలని నిలదీత
- రుణమాఫీ చేశాకే హరీశ్ రావు రాజీనామాను అడుగుతున్నామని వెల్లడి
- మంచి చేసి ఉంటే బీఆర్ఎస్‌ను ఎందుకు ఓడించారో చెప్పాలని నిలదీత
2018లోనూ మరోసారి రుణమాఫీ హామీ ఇచ్చారని, కానీ 2023 వరకు గత ప్రభుత్వానికి రైతులు గుర్తుకు రాలేదని విమర్శించారు. తాము రుణమాఫీ హామీని నిలబెట్టుకున్న తర్వాతే హరీశ్ రావును రాజీనామా చేయమని అడుగుతున్నామని పేర్కొన్నారు. కానీ ఆయన నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి చేసి ఉంటే బీఆర్ఎస్‌ను ప్రజలు ఎందుకు ఓడించారో చెప్పాలని నిలదీశారు.