పవన్-ఆద్య సెల్ఫీపై రేణూ దేశాయ్ స్పందన
- నేడు స్వాతంత్ర్య దినోత్సవం
- కాకినాడలో జరిగిన కార్యక్రమానికి హాజరైన పవన్
- తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ దిగిన డిప్యూటీ సీఎం
"స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి నాన్నతో కలిసి వెళ్లొచ్చా? అని ఆద్య అడిగింది. ఆద్య నన్ను అలా అడగడం ఎంతో ఆనందం కలిగించింది. ఎందుకంటే, ఆమె తన తండ్రితో కొంత సమయం గడపాలని కోరుకుంటోంది. తద్వారా, ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి జీవితం ఎంత బిజీగా ఉంటుందో, తన తండ్రి ఏపీ ప్రజల కోసం ఎంత పాటుపడుతున్నారో చూసి అర్థం చేసుకుని, అభినందించే అవకాశం ఆద్యకు లభిస్తుంది" అంటూ రేణూ దేశాయ్ పేర్కొన్నారు.