భారత్‌కు అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
భారత్-అమెరికా మధ్య బలమైన బంధం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను ఆయన కొనియాడారు. మునుముందు కూడా ఈ బంధం ఇలాగే కొనసాగాలని బ్లింకెన్ ఆకాంక్షించారు. ఈ ఆగస్టు 15 సందర్భంగా అమెరికా తరఫున భారత ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.