Emergency Trailer: కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' ట్రైలర్ విడుద‌ల‌... మ‌రోసారి అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న బాలీవుడ్ క్వీన్‌!

Kangana Ranaut Emergency Trailer Out Now

  • 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా తెర‌కెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ'
  • మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగన 
  • ఈ మూవీలో లీడ్ రోల్‌లో న‌టించ‌డంతో పాటు కంగన ద‌ర్శ‌క‌త్వం 
  • సెప్టెంబర్ 6న మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ మేక‌ర్స్ 

బాలీవుడ్ న‌టి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుద‌లైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. ప్ర‌ధానంగా 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగన కనిపిస్తారు.

ఇక ఈ మూవీలో లీడ్ రోల్‌లో న‌టించ‌డ‌మే కాకుండా కంగన స్వయంగా డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో జయప్రకాశ్ నారాయణ్‌ పాత్రలో సీనియ‌ర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో బాలీవుడ్ నటుడు శ్రేయస్ తల్పడే న‌టించారు. ఇక జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబర్ 6న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు.

  • Loading...

More Telugu News