Manchu Vishnu: 'కన్నప్ప' మూవీ నుంచి మధుబాల లుక్ రిలీజ్!

Kannappa movie update

  • షూటింగు దశలో 'కన్నప్ప'
  • ప్రధానమైన ఆకర్షణగా భారీ తారాగణం
  • ముఖ్యమైన పహారాలో ప్రభాస్  
  • వీఎఫ్ ఎక్స్ కి పెద్దపీట వేసిన దర్శకుడు


హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి బయటకొస్తున్న ఒక్కో అప్ డేట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. 

ఈ క్రమంలోనే తాజాగా 'కన్నప్ప' సినిమా నుంచి మధుబాల లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు పోస్టర్ పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలుపుతున్నాయి. తాజాగా వదిలిన ఈ పోస్టర్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసింది.  అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ మీద పడింది.

'కన్నప్ప' సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది.  ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మలుస్తున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంది.  ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

  • Loading...

More Telugu News