డీజీపీ గారూ... గత ప్రభుత్వ హయాంకి, ఇప్పటికి చట్టాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా?: వర్ల రామయ్య
- సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నాగార్జున యాదవ్
- అదుపులోకి తీసుకుని 41ఏ కింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టిన పోలీసులు
- నాగార్జున యాదవ్ ను పోలీసులు వదిలేశారన్న వార్తలపై తీవ్రంగా స్పందించిన వర్ల రామయ్య
డీజీపీ గారూ... గత ప్రభుత్వ హయాంకి, ఇప్పటికి చట్టాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఇప్పుడు నాగార్జున యాదవ్ చేసిన తప్పులు గతంలో మా పార్టీ వారు చేస్తే విరగ్గొట్టి అరెస్ట్ చేసే వాళ్లు... మరి అంతకంటే ఘోరంగా వ్యవహరించిన వైసీపీ యాదవ్ గారిని పోలీసులు విచారణ చేసి వదిలేశారట... ఓసారి కనుక్కోగలరా? అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.