ఏ పరాయి మహిళతోను నాకు అనైతిక, అక్రమ సంబంధాలు లేవు: విజయసాయిరెడ్డి
- శాంతిని ఇప్పటి వరకు కూతురుగానే భావించానన్న విజయసాయి
- కొడుకు పుట్టాడని చెపితే వెళ్లి పరామర్శించానని వ్యాఖ్య
- మా తాడేపల్లి ఇంటికి వస్తే ఆశీర్వదించానన్న విజయసాయి
ఏపీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా ఉన్న శాంతిని 2020 సంవత్సరంలో వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను కూతురుగానే భావించానని... ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశానని అన్నారు. తనకు కొడుకు పుట్టాడని చెపితే వెళ్లి పరామర్శించానని తెలిపారు. తమ తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించానని చెప్పారు. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు తనకు లేవని స్పష్టం చేశారు. తాను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా ఇదే మాట చెపుతానని అన్నారు.