మంత్రి నారా లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ
- ఉపాధి కోసం ఏపీ నుంచి కువైట్ వెళ్లిన శివ
- పడరాని కష్టాలు పడుతున్నానంటూ వీడియో
- ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో వేడుకున్న వైనం
- వెంటనే స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్
మంత్రి లోకేశ్ చొరవతో శివ కువైట్ నుంచి ఏపీకి తిరిగి వచ్చాడు. ఎయిర్ పోర్టులో శివను చూసి అతడి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగాలతో కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, శివ తన స్వస్థలం మదనపల్లె చేరుకున్న విషయం తెలుసుకున్న నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.