శ్రీశైలం క్షేత్రంలో చంద్రలింగాన్ని చుట్టుకున్న నాగుపాము.. వీడియో ఇదిగో!
- మల్లికార్జున స్వామిని చేరుకున్న వాసుకి
- అరుదైన దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తులు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఇది చూసి మల్లికార్జున స్వామి వద్దకు వాసుకి వచ్చి చేరిందని విశ్వసిస్తూ భక్తులు తన్మయత్వం చెందారు. ఈ విషయం తెలిసి భక్తులు ఆలయానికి పోటెత్తారు. కాగా, అటవీ ప్రాంతం కావడంతో ఆలయం చుట్టుపక్కల పాములు తిరుగాడటం సాధారణమే కానీ ఇలా లింగాన్ని ఓ పాము చుట్టుకుని కనిపించడం అసాధారణమని ఆలయ సిబ్బంది తెలిపారు. గతంలో ఇలాంటి సంఘటన జరిగినట్లు వినలేదని పేర్కొన్నారు. ఈ అసాధారణ దృశ్యాన్ని కొంతమంది భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.