వనమహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. ఇది అందరి జీవితంలో అలవాటు కావాలన్నారు. ప్రభుత్వం మొక్కలు పంపిణీ చేస్తోందని... కానీ ఇందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. కాలుష్యం తగ్గాలంటే, వ్యాధులు దరి చేరవద్దంటే అందరూ చెట్లు పెంచడంపై దృష్టి సారించాలన్నారు. ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయాలన్నారు. దీనిని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా సామాజిక కార్యక్రమంగా చేపట్టాలన్నారు.