భారతీయుడు-2 తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే...!
- కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో భారతీయుడు-2
- జులై 12న వరల్డ్ వైడ్ రిలీజ్
- తొలి రోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.12 కోట్ల గ్రాస్
- అమెరికా ప్రీమియర్స్ ద్వారా రూ.8.34 కోట్లు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయుడు-2 రూ.12 కోట్లు రాబట్టింది. అటు, అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా రూ.8.34 కోట్లు వసూలు చేసింది. కాగా, ఈ చిత్రం విడుదలకు ముందు భారీగా బిజినెస్ చేసిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఇంకా వసూళ్లు పెరిగితేనే చిత్రం బ్రేక్ ఈవెన్ కు వస్తుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై భారతీయుడు-2 చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చ్రితంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.