ఇలాంటి వాళ్లు చాలా డేంజరస్.. సోషల్ మీడియాలో మంచు మనోజ్ ఆగ్రహం
- తండ్రీకూతుళ్ల వీడియోపై ఓ కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్‌లో అసభ్యకర కామెంట్స్
- వీడియోపై మంచు మనోజ్ తీవ్ర ఆగ్రహం
- ఇలాంటి వారు చాలా ప్రమాదకరమంటూ ఎక్స్ వేదికగా పోస్టు
- తగు చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ సీఎంను ట్యాగ్ చేసిన వైనం
ఇక మంచు మనోజ్ తన పోస్టులో తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ‘‘హస్యం పేరిట ఇలాంటి వ్యక్తులు ద్వేషం, వేధింపుల ధోరణిని వ్యాప్తి చేయడం దారుణం. భరించలేకుండా ఉన్నా. ఈ ప్రవర్తన రోతపుట్టించేదే కాకుండా ప్రమాదకరమైదని కూడా. సంవత్సరం క్రితం, నేను ఏపీ, తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటానికి అతడి మద్దతు కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించాను. అతడి ఛానల్ పాప్యులారిటీ కారణంగా సమాజంపై మరింత మంచి ప్రభావం పడుతుందని అనుకున్నాను. కానీ అతడి నుంచి ఏ స్పందన రాలేదు. ఈ రోజు అతడు చిన్నారుల గురించి నీచమైన కామెంట్స్ చేస్తున్నాడు. పిల్లల, మహిళ భద్రతకే మన తొలి ప్రాధాన్యం. ఇలాంటి సందర్భాల్లో మౌనంగా, క్రియారహితంగా ఉండటం సరికాదు. ఇలాంటి వాళ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ సీఎం, డిప్యుటీ సీఎంను కోరుతున్నాను’’ అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని అమెరికా పోలీసులతో పాటు భారత్‌లో అమెరికా ఎంబసీ వారిని కూడా మంచు మనోజ్ అభ్యర్థించారు.