Bharateeyudu 2: హైదరాబాద్ లో గ్రాండ్ గా భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్

Bhrateeyudu2 pre release event held in Hyderabad

  • కమల్ హాసన్, శంకర్ కాంబోలో భారతీయుడు-2
  • జులై 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
  • హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన తారాగణం

లోకనాయకుడు కమల్ హాసన్, టాప్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న భారతీయుడు-2 చిత్రం జులై 12న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 ఈ నేపథ్యంలో, నేడు హైదరాబాదులో భారతీయుడు-2 చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వేదిక. కమల్ హాసన్, దర్శకుడు శంకర్, నిర్మాత, లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్, యువ హీరో సిద్ధార్థ్, సముద్రఖని, ఎస్.జె.సూర్య, బాబీ సింహా తదితరులు ఈ వేడుకకు విచ్చేశారు. 

భారతీయుడు-2 చిత్రంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్  సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, ఎస్.జె.సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం, గుల్షన్ గ్రోవర్, కాళిదాస్ జయరామ్ తదితరులు నటించారు. 

గతంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన భారతీయుడు-2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ ను కూడా ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News