30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి!
- కాశీకి వెళ్లినప్పుడు తనకిష్టమైన షాపింగ్ అలవాటును వదిలేశానన్న సుధామూర్తి
- నిరాడంబర జీవన శైలి తనకు తల్లి, అమ్మమ్మల నుంచి వారసత్వంగా సంక్రమించిందని వెల్లడి
- సాధారణ జీవితం గడిపేందుకు తానెప్పుడూ ఇబ్బంది పడలేదని వ్యాఖ్య
‘‘ఆరేళ్ల క్రితం నా తల్లి చనిపోయినప్పుడు ఆమె కప్ బోర్డును ఖాళీ చేసేందుకు ఇతరులకు ఇచ్చేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే ఆవిడ వద్ద 8 - 10 చీరలే ఉండేవి. 36 ఏళ్ల క్రితం మా అమ్మమ్మ చనిపోయింది. అప్పట్లో ఆమె వద్ద నాలుగు మాత్రమే ఉండేవి. వారందరూ అత్యంత నిరాడంబర జీవితం గడిపారు. కాబట్టి, ఆ విలువలతోనే నన్ను పెంచారు. వస్తు వ్యామోహం లేని నిరాడంబర జీవితాన్ని గడిపేందుకు నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు’’ అని ఆమె వివరించారు.