తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
- 8న వైఎస్ 75వ జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానం
- షర్మిలకు శాలువా కప్పి సత్కరించిన రేవంత్ రెడ్డి
- భట్టివిక్రమార్క, పొన్నం ప్రభాకర్‌లకూ ఆహ్వానం
షర్మిల ఆ తర్వాత, ప్రజాభవన్‌లో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కలిశారు. ఆయనను కూడా జయంతి కార్యక్రమానికి ఆహ్వానించారు. జులై 8న విజయవాడలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు షర్మిల తెలిపారు. ఈ వేడుకలకు ఆమె పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా ఆహ్వానించారు.