భర్తకు మరో పెళ్లి చేసిన అతని భార్యలు!
కించూరు గ్రామానికి చెందిన సాగేని పండన్నకు 2000లో పార్వతమ్మతో వివాహం జరిగింది. కానీ ఆమెకు సంతానం కలగలేదు. 2005లో అప్పలమ్మను వివాహం చేసుకున్నాడు. 2007లో వీరికి ఓ అబ్బాయి పుట్టాడు. ఆ తరువాత ఆమెకూ సంతానం కలగలేదు. ఈ క్రమంలో ఇద్దరు భార్యల అనుమతితో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. గత నెల 25న జరిగిన మూడో పెళ్లికి భార్యలే పెద్దలుగా వ్యవహరించి, పెళ్లి కార్డులు ప్రింట్ చేయించి, బ్యానర్లు వేయించారు. సంతానం కోసం తన భార్యలు త్యాగం చేశారంటూ పండన్న తెలిపాడు.