అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’ మూవీ గ్లింప్స్ వచ్చేశాయ్.. మాస్ లుక్ అదుర్స్
- హీరో అల్లరి నరేశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల
- మాస్ లుక్‌లో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న నరేశ్
- ‘ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి’ అంటూ అదిరిపోయే డైలాగ్
కాగా 1990 దశకంలో జరిగిన నిజజీవిత ఘటనల ఆధారంగా ‘బచ్చల మల్లి’ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరో అల్లరి నరేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా అలరించబోతున్నాడు. ఈ మేరకు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్టు గింప్స్ వీడియోలో చిత్ర బృందం పేర్కొంది.
ఇక హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుట్ట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హనుమాన్ మూవీ ఫేమ్ అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు.