జీవన్ రెడ్డిని ఏఐసీసీ పెద్దల వద్దకు తీసుకెళ్లిన మున్షీ, శ్రీధర్ బాబు
- అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న జీవన్ రెడ్డి
- దీపాదాస్ మున్షీతో సమావేశమైన జీవన్ రెడ్డి
- శ్రీధర్ బాబు కారులో ఏఐసీసీ పెద్దల వద్దకు కాంగ్రెస్ అసంతృప్త నేత
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు దీపాదాస్ స్పందించారు. తమ పార్టీలో ఎవరూ అసంతృప్తిగా లేరని తెలిపారు. ఊహాజనిత ప్రశ్నలకు మాత్రం తాను సమాధానం చెప్పనని స్పష్టం చేశారు. మీడియా జీవన్ రెడ్డిని పలకరించే ప్రయత్నం చేసింది. అయితే, తర్వాత మాట్లాడుతానంటూ ఆయన వెళ్లిపోయారు.