తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపును మహేశ్ బాబు ముందే ఊహించాడు: ఆదిశేషగిరిరావు
రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆదిశేషగిరిరావు అన్నారు. నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం, రాజకీయ ప్రసంగాలు, మీడియా మేనేజ్‌మెంట్, స్లోగన్లు.. వంటి విషయాల్లో రేవంత్ నిర్వహణ చాలా బాగుందన్నారు. అధికారంలోకి వచ్చాక కూడా అందరినీ కలుపుకుని ముందుకు వెళుతున్నారని ప్రశించారు. అయితే, ఈ ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ కారణంగా పరిపాలనలో రేవంత్ మార్కు ఇంకా కనబడలేదని చెప్పారు. ఆయన ఆలోచనలు ఇంకా కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఎన్నికల హామీలు, ఇతర అంశాల అమలులో రేవంత్ పనితీరు తదుపరి ఆరు నెలల్లో చూడాలని, ఈ విషయంలో సీఎం విజయంసాధిస్తారనే అనుకుంటున్నానని అన్నారు.