బాధితురాలిని పెళ్లి చేసుకొని రావాలంటూ అత్యాచార నిందితుడికి కర్ణాటక హైకోర్ట్ బెయిల్
- ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదరడంతో బాధితురాలితో నిందితుడి పెళ్లి నిశ్చయం
- ఇటీవలే బాధితురాలికి నిండిన 18 ఏళ్లు
- తదుపరి విచారణ లోగా పెళ్లి చేసుకొని సర్టిఫికేట్ తీసుకోవాలని ఆదేశం
బిడ్డ రక్షణ, బాధితురాలి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఇద్దరూ పెళ్లి చేసుకోవడం మంచిదని భావించింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ పిటిషనర్ అయిన నిందితుడికి 15 రోజుల బెయిల్ ఇచ్చింది. జులై 3న సాయంత్రం కస్టడీకి రావాలని, జులై 4న జరగనున్న తదుపరి విచారణకు వివాహ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని రావాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎం నాగప్రసన్న శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా తన కూతురిపై నిందితుడు పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 2023లో నిందితుడిని అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 376(2)(ఎన్) తో పాటు పోక్సో చట్టం-2012లోని 5(ఎల్), 5(జే)(ii), సెక్షన్-6 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.