మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్లగొండ ఔటర్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితుల సెగ
- నల్లగొండ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చాలని బాధితుల నిరసన
- కాళ్ల మీద పడ్డా కనికరం చూపలేదని ఆవేదన
- సీఎం రేవంత్ వచ్చినా చేసేదేమీ లేదని జారుకున్న మంత్రి కోమటిరెడ్డి
తమకు న్యాయం చేస్తారని గెలిపిస్తే కష్టపడి కొనుక్కున్న తమ భూములు గుంజుకుంటున్నారని నిర్వాసితులు వాపోయారు. తమకు అన్యాయం జరిగితే కోమటిరెడ్డి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. కాగా, నల్లగొండ పట్టణం మీదుగా కేంద్ర ప్రభుత్వం 565 నంబర్ జాతీయ రహదారిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.