చిరంజీవి 'విశ్వంభర' సెట్స్ పై అడుగుపెట్టిన బాలీవుడ్ నటుడు
- చిరంజీవి ప్రధాన పాత్రలో వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర'
- విలన్ కునాల్ కపూర్ గురించి అప్ డేట్ ఇచ్చిన చిత్రబృందం
- వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు 'విశ్వంభర'
కాగా, కునాల్ 'విశ్వంభర' చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. అతడే విలన్ అని రివీల్ అయ్యే సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు.
'విశ్వంభర' చిత్రం 2025 సంక్రాంతి సీజన్ లో విడుదల కానుంది. చిత్రబృందం జనవరి 10వ తేదీని రిలీజ్ డేట్ గా ఇప్పటికే లాక్ చేసింది. ఈ సినిమా షూటింగ్ జులై నాటికి పూర్తి కానుండగా, కథను అనుసరించి గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించనున్నారు.